Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
జనాభా నియంత్రణతోనే సమాజాభివద్ధి సాధ్యమవుతుందని హైదరాబాద్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి అన్నారు. సోమవారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల అల్యూమిని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనాభా పెరుగుదల నియంత్రణతోనే కుటుంబం, సమాజం, దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రతీ కుటుంబం ఈ విషయాన్ని గమనించాలని, చిన్న కుటుంబానికే పరిమితం కావాలని సూచించారు. ప్రస్తుత భారత దేశ జనాభా 140 కోట్లు చేరిందని, తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల 10 లక్షల జనాభాగా ఉందన్నారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని గ్రహించాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్పీహెచ్ఓలు, డాక్టర్లకు, వైద్య అధికారులకు, సిబ్బందికి జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్, వ్యాసెక్టమీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, కింగ్ కోఠి క్లస్టర్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ, మాస్ మీడియా అధికారులు నాగరాజు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, పీహెచ్ఎన్ రామలక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.