Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యధిక ప్యాకేజీ రూ.55.65 లక్షలు
- 278 కార్పొరేట్ల నుంచి 4600 ఆఫర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రాడ్యుయేషన్, ఉన్నత విద్య కోసం దేశంలో అగ్రగామి యూనివర్శిటీలలో ఒకటైన కెఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ, ఈ విద్యా సంవత్సరం కోసం తమ విద్యార్థులకు 100శాతం క్యాంపస్ ప్లేస్మెంట్లు జరిగాయని వెల్లడించింది. ఈ మల్టీ డిసిప్లీనరీ యూనివర్శిటీ 4600కు పైగా ఉద్యోగ ఆఫర్లు అందుకో వడంతో పాటుగా గత సంవత్సరంతో పోలిస్తే ఆఫర్ల సంఖ్య పరంగా 42 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ప్లేస్మెంట్ సీజన్‌ను అత్యున్నత స్ఫూర్తితో ప్రారంభించిన యూనివర్శిటీ, ఇటీవలనే ఈ ప్లేస్మెంట్ సీజన్‌ను ముగించడంతో పాటుగా జాతీయ, అంతర్జాతీయ రిక్రూటర్ల నుంచి అద్భుతమైన ఆసక్తిని పొందింది. ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్స్పరంగా నూతన మైలురాయిని ఈ యూనివర్శిటీ అందుకుంది. అత్యధికంగా ఓ విద్యార్థికి రూ.55లక్షల ప్యాకేజీని ఓ మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ అందించింది. సరాసరి శాలరీ ప్యాకేజీ సైతం గణనీయంగా వృద్ధి చెందింది. 2021లో సంవత్సరానికి సరాసరి రూ.6.4లక్షల ప్యాకేజీ ఉంటే 2022 సంవత్సరంలో అది రూ.9.7లక్షలకు చేరింది. తద్వారా 50శాతం వృద్ధి నమోదు చేసింది. ఇతర జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్లలో, కెేఎల్ ప్రతిభను పుష్కలంగా సొంతం చేసుకున్న సుప్రసిద్ధ రిక్రూటర్లలో కాగ్నిజెంట్ 714 ఆఫర్లను అందించగా విప్రో 519 ఆఫర్లను, టీసీఎస్ 413 ఆఫర్లను, క్యాప్‌జెమిని 213 ఆఫర్లను, యాక్సెంచర్ 207 ఆఫర్లను, హెచ్‌సీఎల్ 203 ఆఫర్లను, డెలాయిట్ 104 ఆఫర్లను విద్యార్ధులకు అందించాయి. ఈ ప్లేస్మెంట్ సీజన్లో అత్యంత ఆసక్తికరమైన ధోరణులు రిక్రూట్మెంట్ సమయంలో కనిపించాయి. గ్రాడ్యుయేట్లకు కోర్, మేనేజ్మెంట్, ఐటీ, ప్రొడక్ట్, సర్వీస్ రంగాలలో ప్లేస్‌మెంట్స్ లభించాయి. కెఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ వద్ద ఈ ప్లేస్మెంట్ సీజన్లో పాల్గొన్న ఐటీ, బీఎఫ్ఎస్ఐ, కన్సల్టెన్సీ, ఈ-కామర్స్, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందిన ఇతర సుప్రసిద్ధ రిక్రూటర్లలో అడోబ్, అమెజాన్, సర్వీస్ నౌ, ఫ్లిప్‌కార్ట్, హెచ్‌పీ, హ్యుందారు, వోడాఫోన్, ఎయిర్టెల్, బైజూస్, సిస్కో సిస్టమ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, గోల్డ్‌మన్ శాచ్స్ ఇంక్, ఇన్ఫోసిస్, పెగా సిస్టమ్స్, ఎనలాగ్ డివైజస్ మరియు మరెన్నో ఉన్నాయి.