Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
చైతన్యపురిలో జరుగుతున్న వరదనీటి కాల్వ పనులను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి జీహెచ్ఎంసి అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం దష్ట్యా పనులు జాగ్రత్తగా చేయాలని సూచించారు. అన్ని రక్షణ చర్యలు పాటించాలని తెలిపారు. దాదాపు 450 మీటర్ల వరకు బాక్స్ డ్రైన్ పనులు పూర్తికావడం జరిగిందన్నారు. బాక్స్ డ్రైన్స్ పనులు సకాలంలో పూర్తి అయితే వరదముంపు నుండి పూర్తి విముక్తి లభిస్తుందని తెలిపారు. దానిలో భాగంగా సరూర్‌నగర్ చెరువు నుంచి తిరుమలనగర్, కోదండరామ్‌నగర్ నుంచి, వివేకానందనగర్, కష్ణానగర్ శ్మశానవాటిక, శ్రీనగర్‌కాలనీ నుంచి చైతన్యపురి నాలా నుంచి వరద నీరు మూసిలోకి వెళుతుందన్నారు. అన్నపూర్ణ కళ్యాణ మండపం మీదుగా కళానికేతన్ ఎదురుగా ఉన్న మూసీిలోకి వరదనీరు పోయే విధంగా పనులు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే పనులు ప్రారంభం కావడం జరిగిందని పేర్కొన్నారు. బాక్స్ డ్రైన్స్ పనుల నేపథ్యంలో ప్రజలు ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వరద నీటి కాల్వ పనులు జరుగుతున్న సమయంలో అధికారులకు కాలనీవాసులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఈ.ఈ కష్ణయ్య, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్‌కుమార్, తులసి శ్రీనివాస్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.