Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత సంవత్సరంతో పోలిస్తే వరద నీటి ముంపు అధికం
- ముంపు ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుమతులు
- మున్సిపాలిటీ ఉన్నతాధికారులుచర్యలు చేపట్టాలి
నవతెలంగాణ-వనస్థలిపురం
ఎన్నో సంవత్సరాలుగా వరద ముంపుతో అల్లాడిపోతున్న శారదానగర్, నరసింహారెడ్డి కాలనీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వైఖరి కొట్టొచ్చినట్టు కనపడుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే శారదానగర్ కాలనీకి కూడా వరద నీటి ముప్పుతో అల్లాడుతుంది, దీనికి తోడు ఉన్నత అధికారులు బహుళ అంతస్తులు నిర్మాణానికి ముంపు ప్రాంతంలోనే పర్మిషన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కాలనీవాసులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎలక్ట్రిసిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరికి శారదానగర్ కాలనీలోని ఫేస్ 3లో నీట మునిగిన ట్రాన్స్ఫార్మర్మ్స్
శారదానగర్, నరసింహనగర్ కాలనీ పేస్ 3లో నివాస వాసులు వరద ముంపుతో అల్లాటడంతో పాటు ప్రాణ హానితో బిక్కిబిక్కుమని జీవన సాగిస్తున్నారు. లోతట్టు, వరద ముంపు ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణా నికి అనుమతిలిస్తున్న అధికారులతో పాటు విద్యుత్తు ఉన్నతాధికారులు కలిసి ముందుకు సాగుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరద ముంపు ప్రాంతంలో గల మూడు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫాÛర్మర్స్ నీటిలో మునిగి విద్యుత్తు అధికారుల నిర్లక్ష్య వైఖరిని ప్రతిబిం బిస్తుంది. కనీసం ఆ కనీసం ఫెన్సింగ్ వేయకుండా వదిలివేయటం ఎంతవరకు సమంజసం అని విద్యుత్ అధికారులపై మండిపడుతున్నారు.
జీహెచ్ఎంసి అత్యున్నత అధికారులు చర్యలు తీసుకోవాలి
కల్వంచ శాంతినగర్ మీదగా బస్సు డిపోకు వెళ్లే రోడ్డు వేశారు కానీ, శారదానగర్ నరసింహారావు నగర్లో గల వరద కాలువ పనికి 19లక్షల రూపాయలు నేటికీ జీహెచ్ఎంసి జోనల్ ఆఫీసులో కదలకుండా ఉన్నాయని, దీనికి అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం కాదా? లేకుంటే శారదానగర్, నరసింహానగర్ కాలనీవాసులు పాత పాతబస్తీ వాసుల్లాగా కరెంట్ బిల్లులు, ఇంటి పనులు చెల్లించుటంలో జాప్యానికి ఒడిగట్టారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో తమ కాలనీలను కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.