Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య
నవతెలంగాణ-తుర్కయంజాల్
కరాటే విద్యార్థులలో శారీరక దారుఢ్యాన్ని కలుగజేస్తుందని డీిసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. తుర్కయం జాల్లోని వీఎన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నాల్గవ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా తైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య హాజరై మాట్లాడుతూ నేపాల్‌లో జరిగిన తైక్వాండో పోటీల్లో మన విద్యార్థులు బంగారు, సిల్వర్‌తో పాటు ఇతర పథకాలు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని, ఆటలతో పాటు, చదువులోనూ ఉన్నత స్థానంలో ఉండాలని సూచించారు. శారీరక, మానసిక ధడత్వానికి కరాటే దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా నేపాల్‌లో పతకాలు సాధించిన విద్యార్థులను, అతిథులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొంతం యాదిరెడ్డి, జొన్నాడ వెంకటరెడ్డి, కిషన్, వీఎన్ అకాడమీ చైర్మెన్ నరేందర్, సంజరు తదితరులు పాల్గొన్నారు.