Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగుడుదిగుడుగా మ్యాన్‌హోల్స్
- తెగిపడిన విద్యుత్ వైర్లు
నవతెలంగాణ-ఓయూ/జూబ్లీహిల్స్
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హబ్సిగూడ ప్రధాన కూడలి నుంచి నాచారం వెళ్లే రోడ్డులో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. తార్నాక డివిజన్ లాలాపేట హైస్కూల్‌కు సమీపంలో రెండు రోజుల కిందట లారీ మ్యాన్‌హోల్‌లో ఇరుక్కుపోయింది. దీంతో అక్కడ మ్యాన్‌హోల్ నేటికీ మరమ్మతులు చేపట్టకుండా తెరిచి ఉండటంతో వాహనదారులు, బాటసారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇక తార్నాక, హబ్సిగూడా, బౌద్దనగర్, సీతాఫల్‌మండీ డివిజన్స్వ్యాప్తంగా ప్రధాన రహదారుల పరిస్థితి ఇలా ఉంటే అంతర్గత రహదారులు చిన్నచితక గుంతలమయంగా మారాయి. మ్యాన్‌హోల్స్ కూడా ఎగుడుదిగుడుగా ఉన్నాయి. సంబంధించిన అధికారులు మాత్రం నేటి వరకు అసలు మ్యాన్‌హోల్స్ మరమ్మతులు చేపట్టిన పాపాన పోలేదు అని స్థానిక ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి, ఈదురుగాలులకు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రధాన గేటు ఎదుట విద్యుత్ వైర్లు తెగి కిందపడ్డాయి.