Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయ్యప్ప కాలనీవాసుల ఆవేదన
నవతెలంగాణ-నాగోల్
శుక్రవారం నుండి కురుస్తున్న వర్షాలకు డివిజన్ పరిధిలోని అయ్యప్ప కాలనీలో రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండి పోయాయి. దీంతో తమ గోడు ఎవ్వరికి పట్టాదా అంటూ కాలనీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వర్షపు నీరు, మరో వైపు పొంగుతున్న డ్రైనేజీ నీరు తోడవడంతో రోడ్లన్నీ మురికి నీటితో నిండిపోయాయని, దీంతో ఇంటినుండి బయటకు వెళ్లలేనిస్థితిలో కొట్టుమి ట్టాడుతు న్నామని కాలనీవాసులు వాపోతున్నారు. కాగా కాలనీలోని పోచమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న రోడ్డు పొడవునా ఫీట్ల కొద్ది నీరు నిలిచిపోయింది. చెరువుకు అనుసరించుకొని ఉన్న ఈ కాలనీకి డ్రైనేజీ వ్యవస్థ చెరువు కంటే దిగువన ఉండడంతో చెరువులోకి వెళ్లాల్సిన డ్రైనేజీ తిరిగి కాలనీలోకి వస్తోందని అయ్యప్ప కాలనీవాసులు తెలిపారు. ఏ కొద్దిపాటి వర్షాలు వచ్చినా మా పరిస్థితి ఇలాగే ఉంటుందని, ప్రతిసారీ కంటితుడుపు చర్యలే చేపట్టి చేతులు దులుపుకోవడమే తప్ప ఒరగబెట్టింది ఏమిలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది ఈ పరిస్థితులను తట్టుకోలేక ఇండ్లు ఖాళీ చేసి ఇతర కాలనీలకు వెళుతున్నా మా వైపు కన్నెతి చూసేవారే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టి తిరిగి ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని అయ్యప్ప కాలనీ ప్రజలు కోరుతున్నారు.