Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పిన పెనుప్రమాదం
- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపౖౖె స్థానికుల ఆగ్రహం
నవతెలంగాణ-వనస్థలిపురం
గణేష్ టెంపుల్ చౌరస్తా వద్ద ట్రాన్స్ఫార్మÛర్ పక్కనే సోమవారం రాత్రి కురిసిన వర్షానికి భారీ చెట్టు విరిగి అటు వైపునున్న ట్రాన్స్ఫార్మÛర్ మీద పడకుండా పక్కనే గణేష్ టెంపుల్ గోడమీద పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి పదేపదే హెచ్చరిస్తున్నా డివిజన్లో కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మÛర్లకి ఫెన్సింగ్ లేకుండా ఉండటం, మరికొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మÛర్ పక్కనే భారీ చెట్లు ఉండటంతో వాటి వలన ముందు ముందు రోజుల్లో ప్రమాదం వాటిల్లు తుందన్న ఆలోచన లేకపోవడం విద్యుత్ అధికారుల వైఫల్య కారణంగా కనిపిస్తోంది.
తప్పిన ప్రమాదం
నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే గణేష్ టెంపుల్ చౌరస్తా వద్దనున్న ట్రాన్స్ఫార్మÛర్ రాత్రి కురిసిన వానగాలికి విరిగి ట్రాన్స్ఫార్మÛర్ మీద పడితే పెద్ద ప్రమాదం వాటిల్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవలసిన విద్యుత్తు ఉన్నత స్థాయి అధికారులు నిమ్మకి నీరెెత్తినట్లు వ్యవహరించడంతో ప్రమాదాలు జరగకమానతాయా? ఈసారి వర్షపాతం అధికంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా సంబంధిత ఆయా శాఖల అధికారులు పెడచెవిన పెట్టడంతో ప్రజలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెట్టు తొలగించడంలో నిర్లక్ష్యం
రాత్రి కురిసిన వానకి నడిరోడ్డు పక్కన చెట్టు విరిగి టెంపుల్ గోడకి సపోర్టుగా బ్యాలెన్సింగ్‌తో ఉన్నా, కొన్ని కొమ్మలు విరిగి రోడ్డు మీద పడినా జీహెచ్‌ఎంసీి అధికా రులుగాని, విద్యుత్‌శాఖ అధికారులు గానీ ఏమాత్రం ఇటువైపు చూడకపోవటం వారి పనితీరుకు నిదర్శనం. ఈ విధంగా అధికారులు విధులు నిర్వహిస్తే వారిపై ఉన్నత అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోపోటం విచారకరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.