Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవేదనలో సీనియర్ సిటిజన్స్
నవతెలంగాణ-వనస్థలిపురం
నెల ప్రారంభమై ఇప్పటికి రెండు వారాలు గడిచిపోయినా రాష్ట్రంలో పలు జిల్లాల్లో పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని తెలంగాణ ప్రభుత్వం పెన్షన్‌దారుల సంయుక్త కార్యచరణ సమితి చెర్మెన్ కొలిశెట్టి లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెన్షన్‌దారులు మాట్లాడుతూ పెన్షన్‌తో జీవితం గడపవలసిన పెన్షన్‌దారులను ఈవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వేధించటం ఎంతవరకు న్యాయమని, ఇంటి అద్దె, బ్యాంక్ చెల్లింపులు, నిత్యావసర వస్తువుల కొనుగోలు, మధ్యతరగతి జీవితాలు పదవీ విరమణ పొందిన అనంతరం మెడికల్ బిల్లులు, మందు ఖర్చులు అదనం, సకాలంలో పెన్షన్ అందటంతో కొద్దిపాటి పెన్షన్లతో జీవితం గడుపుతున్న పెన్షన్‌దారులు ఫ్యామిలీ దుర్భరం గా మారిందని అన్నారు. సంవత్సరం కాలం నుండి ఎప్పుడు వస్తాయో తెలియని పెన్షన్లు, పలుమార్లు ఆర్థిక శాఖ మంత్రి, సంబంధిత అధికారులకు విన్నపించుకున్నా తమ విన్నపాన్ని పెడచెవినపెట్టారన్నారు. ప్రతినెల నెలకు మంజూరు కావలసిన కరువు ఉపశమనం ఊసే లేదు. మూడు విడతల కరువు ఉపశమనం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉండగా దాని ఊసే పట్టించుకోవటం లేదని, పెరుగుతున్న ధరలతో భారమవుతున్న మెడికల్ బిల్లులతో బతుకుదుర్భరంగా మారిందన్నారు. రాష్ట్ర మంతటా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పెన్షన్లు పెన్షన్‌దారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేయాలని, ఆలస్యమైన మూడు విత్తుల కరువు ఉపశమనం వెంటనే విడుదల చేయాలని, ఇంతవరకు ప్రభు త్వానికి విన్నపించుకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశం లో తెలంగాణ ప్రభుత్వం పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఫైనాన్స్ సెక్రటరీ బిఎన్వివి కష్ణ ప్రసాద్, సెక్రెటరీ జనరల్ టి.శుభకరరావు, కోచైర్మెన్లు ఎం.సత్యనారాయణ, పి.కష్ణమూర్తి, ఎ.రాజేంద్రబాబు, ఎం.భరత్‌రెడ్డి, వైస్ చైర్మెన్లు ఎస్.జ్ఞానేశ్వర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ పి.జయప్రకాష్‌రావు, సెక్రెటరీ ఎస్.ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు.