Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
భారీ వర్షాల కారణంగా బాలానగర్ డివిజన్లోగల చరబండ రాజునగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలను ఆనుకుని ఉన్న హిందుస్థాన్ ఏరోనాటికల్ (హెచ్ఎఎల్) ప్రహరీకూలిపోయింది. పాఠశాలకు సెలవులు కావడంతో విద్యార్థులు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. మరి కొంతమేర కూలిపోయే అవకాశం ఉందని, కాగా పాఠశాల భవనం పురాతన భవనం కావడంతో పెచ్చులూడుతున్న పాఠశాల ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా సీపీిఐ(ఎం) బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ స్పందిస్తూ ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్న శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారడం లేదు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మన బస్తీి - మన బడి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించలేదు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతి నిధులు పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీలో సాధారణ రోజుల్లో విద్యార్థులు ఆ ప్రదేశాలలో ఆడుకుంటారని, పాఠశాలలకు సెలవులు కావడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదని అన్నారు. విద్యాధికారులు వెంటనే స్పందించి శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, నూతన భవనాన్ని వెంటనే నిర్మించాలని రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి చైతన్య రెడ్డి, ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు జి.సుగుణ, సీఐటీియు నాయకులు జగన్, సత్యనారాయణ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.