Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొద్దస్తమానం ముసురు
- మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి
- ఎఫ్టీఎల్దాటిన హుస్సేన్‌సాగర్
- దిగువకు నీటి విడుదల
- కంట్రోల్ రూమ్‌కు 1113 ఫిర్యాదులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
వాన వదలడం లేదు. నగరంలో ముసురు ఊసూరు మంటోంది. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది.ఉదయం నుంచి సాయంత్ర భారీ వర్షం, వర్షం ఆగిపోయా ముసురు, మళ్లీ వర్షం ఇలా కురుస్తూనే ఉన్నాయి. రోజూ రాత్రి సమయాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై నీరు వరదలైపారుతోంది. సోమవారం రాత్రి అంబర్పేట్, ముసారాంబాగ్, ఉప్పల్ క్రాస్‌రోడ్డు, నాగోల్, ఎల్బీనగర్, సాగర్‌రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో రోడ్లన్ని చెరువులను తలపించాయి. దీంతోపాటు రోడ్లపై భారీగా గుంతలు పడ్డాయి. నారాయణగుడ ఫ్లైఓవర్‌పై పదికిపైగా గుంతలు పడ్డాయి. మల్కాజ్గిరి, నేరెడ్మెట్, ఆల్వాల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, చిక్కడపల్లి, ముషిరాబాద్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, అమీర్‌పేట్ ప్రాంతాల్లో రోడ్లపై గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులపాటు ముసురు తప్పదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
1113 ఫిర్యాదులు
వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు 1113 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వడంపై 995 ఫిర్యాదుల, చెట్లు విరిగిన ఫిర్యాదులు 118 వచ్చాయి. గ్రేటర్లో నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేని వర్షాల నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా వాటర్‌లాగింగ్, చెట్లు పడిపోయిన, నిర్మాణవ్యర్థాలు, విద్యుత్, ఇంజినీరింగ్, స్ట్రీట్ లైట్, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్, తాగునీటి సరఫరా, ఇతర విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులను టెలిఫోన్, మైజీహెచ్ఎంసీ యాప్, ట్విట్టర్, న్యూస్‌పేపర్, ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఉదయం 8.30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8.30 గంటల వరకు పరిగణిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూం 040-21111111గాని, మైజీహెచ్ఎంసీయాప్ ద్వారా కూడ ఫిర్యాదులు చేయెచ్చని అధికారులు చెబుతున్నారు.
నిండుకుండలా హుస్సేన్‌సాగర్
ఎగువ ప్రాంతాల్లో ముసురు, భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్ గరిష్ట నీటి మట్టం 514.75మీటర్లుగా ఉంది. అయితే పూర్తిస్థాయి నీటి మట్టం 513.41మీటర్లు అయితే మంగళవారం సాయంత్రం నాటికి 513.45మీటర్లకు చేరింది. ఈ నీటిని దిగువకు వదలుతున్నారు.