Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోనల్ కమిషనర్ల సమావేశంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జోనల్ వారీగా చేపడుతున్న సహాయక చర్యలపై మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాల న్నారు. నగరంలో నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే తొలగించే ందుకు చర్యలు తీసుకోవాలనీ, నాలాల్లోనూ పేరుకుపోయిన చెత్తను తొలగించాలనీ, మ్యాన్ హౌల్స్ వద్ద చెత్తగాని, మట్టిని గాని తొలగించి సాఫీగా వరదపోయే విధంగా చర్యలు తీసుకో వాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను వెంటనే జాప్యం లేకుండా తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. అధికారులందరూ 24 గంటలూ అందుబాటులో ఉండే విధంగా చూడాలనీ, ఫిిర్యాదు వచ్చిన వెంటనే సంబంధిత ప్రదేశాలకు వెళ్ళి పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల నేపథ్యంలో ఒకే రోజులో 7 సెంటిమీటర్ల వర్షం పడినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎదుర్కోనున్నట్టు తెలిపారు. అదే స్ఫూర్తితో భవిష్యత్‌లోనూ అంత కంటే ఎక్కువ కురిసినా ఎదుర్కునే విధంగా సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మూసీ నదిలో వరదనీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాం త ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాబోయే 24 గంటల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలెవరూ పోల్స్ దగ్గర, చెట్ల కింద, నాలా పరిసర ప్రాంతాల్లో నిలబడకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు రవికిరణ్, శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, మమత, పంకజ, అశోక్‌సామ్రాట్ పాల్గొన్నారు.