Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాపెళ్లి అంజి
నవతెలంగాణ-అడిక్మెట్
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లాపెళ్లి అంజి గురువారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 5 లక్షల 77 వేల మందికి రుణాలివ్వాలని కోరారు. స్కూళ్లు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఉపాధ్యాయులు, పాఠ్యపుస్తకాలు లేక సర్కార్ బడులు వెలవెలబోతున్నాయని చెప్పారు. మనఊరు- మనబడి కార్యక్రమాన్ని ప్రచార ఆర్భాటన కాకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.