Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ సి హాస్టల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉదరుకుమార్ మాట్లాడుతూ కుండపోత వర్షంలో సి హాస్టల్‌కి చిల్లులు పడి అది కూలిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు ధర్నా చేసిన అధికారుల నిర్లక్ష్యంతో సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా వీసీ స్పందించి సి వసతి గృహంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నవీన్, సాయి, గోవిక్, శ్రావణ్, మహేందర్, అన్వేష్, రాజేందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.