Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీజే స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్
నవతెలంగాణ-హైదరాబాద్
భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురై నిరాశ్రయులైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కోరారు. గురువారం ఎంపీజే కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద బాధితుల పట్ల తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. పలుప్రాంతాల్లో అక్రమ కట్టడాలు, నాలాల కబ్జాలు వరదలకు కారణమవుతున్నాయని తెలిపారు. అవినీతి వరదను అడ్డుకోకపోతే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. వరద సహాయ కార్యక్రమాలు సంతప్తికరంగా జరగడం లేదని దుయ్యబట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజలకు అండగా ఉండాలని, ఉదారంగా సహాయం చేయాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వరద నివారణకు శాస్త్రీయ పద్ధతిలో దీర్ఘకాల చర్యలు తీసుకోవడంతోపాటు తక్షణం ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.