Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ-వనస్థలిపురం
తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఆటోనగర్ ఇసుక లారీ అడ్డా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో బూడిరామ్ రెడ్డి మాట్లాడుతూ రవాణారంగం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రవాణా చట్టాల్లో ఆర్టీఏ రవాణా చట్టంలో భాగమైన వాహనాలకు లేట్ ఫిట్నెస్ చార్జీలను రోజుకు 50 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తే ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని, దీనికి తెలంగాణ లారీ యజమానులు హర్షం వ్యక్తం చేస్తూ వాహనదారులు చాలా సంతోషించే నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని లారీ యజమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సురివి లింగస్వామిగౌడ్, గుండు అన్న, గుండు శ్రీనివాస్‌గౌడ్, లారీ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.