Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సిలర్ గూడూరు సబితా ఆంజనేయులుగౌడ్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని నాగారం మున్సిపల్ ఏడో వార్డుకౌన్సిలర్ గూడూరు సబితా ఆంజనేయులు గౌడ్ అన్నారు. గురువారం ఏడో వార్డులోని బ్రహ్మయ్య కాలనీ, ఈశ్వరపురి కాలనీ, ఎస్.వి నగర్ రోడ్డు, మామిళ్ల నారాయణ కాలనీలలో హరితహారంలో భాగంగా పలుచోట్ల మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటికీ తిరిగి నాటుకునేందుకు పూలమొక్కలను అందజేశారు. హరితహారం లక్ష్యాన్ని తెలియజేశారు. అందరూ మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో బ్రహ్మయ్య కాలనీ ప్రధాన కార్యదర్శి మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.