Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కమ్యూనిస్టు పార్టీ ఉప్పల్ (సీపీఐ) 3వ మహాస భలను ఈ నెల 24వ తేదీన నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో నిర్వహించనున్నామనీ, ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సీపీఐ మల్లాపూర్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లాపూర్ నూతన కూడలి వద్ద మహాసభల గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జి.దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారనీ, కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రోత్సహిస్తూ దేశ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసే చట్టాలను రూపొందిస్తున్నారనీ, ఈ చట్టాలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, సంక్షేమ పథకాల అమ లును పక్క దారి పట్టిస్తున్నదన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయకుండా, సామాన్య ప్రజలకు ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందుతాయో స్పష్టం చేయాల న్నారు. అర్హులైన వారందరికీ రెండు పడకల ఇండ్లను కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంద న్నారు. పాలకులు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలపై ఈ మండల మహాసభలలో నిర్దిష్టమైన చర్చలు జరపనున్నట్టు, చర్చల ద్వారా తీర్మానాలను ఆమోదించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్టు తెలిపా రు. ఈ మహాసభలకు రాష్ట్ర నేతలతోపాటు మండల వ్యా ప్తంగా ఉన్న 16 శాఖా కమిటీల కార్యకర్తలు పాల్గొనను న్నారనీ, అన్ని వర్గాల ప్రజలు, కర్షకులు, సానుభూతి పరులు హార్ధికంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్య క్రమంలో సీపీఐ నేతలు ధర్మేంద్ర, సత్య ప్రసాద్, సీతారాం రెడ్డి, సునీల్, మల్కయ్య, రాములు, రాజు పాల్గొన్నారు.