Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్
కాలనీవాసుల విజ్ఞప్తి మెరకు హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సూర్యనగర్ ఈస్ట్ కాలనీలో సందర్శించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కాలనీలోని సమస్యలు కాలనీలో చేపట్టవలసిన అభివద్ధి పనులను అడిగితేలుసు కున్నారు. ఈ సందర్బంగా కాలనీవాసులు సూర్య నగర్ ఈస్ట్ రోడ్ నెం.7-14 వరకు కాలనీ లో ఇల్లు సంఖ్య దిన దిన పెరగడంతో ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు సరిపోవడం లేదు అని. దానితో రోడ్ నెం.9లో ఇల్లు నిర్మాణం జరిగి చాలా రోజులైన్నపటికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం మురుగు నీరు రోడ్ల పై వదిలేయడంతో కాలనీలో దూర్వసనతో పాటు విపరీతమైన దోమలు పెరిగి కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మరియు కాలనీలో చెప్పటవలసిన మౌలిక వసతులపై కార్పొరేటర్‌కి వినతి పత్రం అందజేశారు. కార్పొరేటర్ స్పందించి అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారమయ్యే దిశగా కషి చేస్తూ కాలనీ అభివద్ధి పనులకు అన్నివేళలా వారి సహాయ సహకారాలు అందిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యనగర్ కాలనీ ఈస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యాదగిరి చారి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జ్యోతిశ్వర్ గౌడ్ , యాదగిరి గౌడ్, యాదయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, రాజా వర్ధన్ రెడ్డి, యాదగిరి రెడ్డి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.