Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
సింగరేణి కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్య పరిష్కారాన్ని చర్యలు తీసుకోవాలని బంజారా ప్రజా సంఘం అధ్యక్షుడు నేనావత్ శంకర్ నాయక్ యాకుత్‌పురా నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రికు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆదివారం ఐఎస్ సదన్ డివిజన్ నిరుపేద నివాసస్థలం సింగరేణి కాలనీలో మురుగునీరు, డ్రైనేజీ, చెత్త చెదారం దుర్వాసనతో వర్షాకాలంలో డ్రైనేజీ మరమ్మతులు చేయక దుర్వాసనతో ప్రజలు సతమతవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం గెలిస్తే పేద వాళ్ళ బ్రతుకు తీరిపోతాయనుకున్నామని నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తూ వినతి పత్రంలో పేర్కొన్నారు. గుడిసెవాసులకు కరెంటు మీటర్లు చిన్న చిన్న పనులు చేయలేకపోతున్నారని దురదష్టవశాత్తును మాకు ఓట్లు విలువ తెలియకపోవడంతో ఎన్నికల సమయంలో మోసపోతున్నామని, మా సమస్యలు అలాగే ఉండిపోతున్నాయని, అభివద్ధి సంక్షేమ ఫలాలు కేవలం పత్రికలలో మాత్రమే కనిపిస్తుందని ఎమ్మెల్యేకు నాయక్ వివరంగా వివరించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిశుభ్రత పరిరక్షణ చేపట్టాలని అధికారులకు సూచిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో జి.దాసు, ఎంఐఎం నాయకులు నరసింహ్మ తదితరులు పాల్గొన్నారు.