Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ సౌత్ కమిటీ జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రజా వ్యవస్థను నిర్మూలిస్తూ మోడీ ప్రభుత్వం ప్రజలను రోడ్డుపాలు చేస్తోందని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అన్నారు. ఆదివారం ఐఎస్ సదన్‌లో డీవైఎఫ్ఐ గ్రేటర్ సౌత్ కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక రెండు కోట్లు ఉద్యోగాలు అవకాశాలు ఇస్తామని ఆశపెట్టి నేటికీ భారతదేశంలో లక్షల ఉద్యోగులు కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే, డిఫెన్స్ తదితర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేస్తూ బీజేపీ ప్రభుత్వం మత రాజకీయ వ్యవహరిస్తుంది తప్ప యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వమే మతాల పేరిట రెచ్చకొడుతూ యువతను రోడ్డుపాలు చేస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణలో ఇంటికొక ఉద్యోగం, లక్ష 90 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ మాట కూడా మెదపడం లేదన్నారు. యువత జీవితాలతో రాజకీయంగా చేసుకోవడం తప్ప వారికి ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. పాత నగరం యువకులకు ప్రత్యేక దష్టి పెట్టి, ఉపాధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఏర్పాటు
డీవైఎఫ్ఐ గ్రేటర్ జిల్లా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ప్రకటించారు. అధ్యక్షుడిగా మహ్మద్ ఫాహిమ్, జిల్లా కార్యదర్శి కష్ణనాయక్, ఉపాధ్యక్షులు మహేందర్, సహాయ కార్యదర్శి శమేష్, కోశాధికారి శ్రీను నాయక్, జిల్లా కమిటీ సభ్యులు ఆంజనేయులు, సాయి, రమేష్, సందీప్, ప్రియాంక, నందిని, రాజేష్, రాజేందర్, మురారి, నవీన్, అజరు, నరేన్, సజన, ఎండీ జూబెర్, సయ్యద్ ఇర్ఫాన్, ఎండి జుబ్బార్, శశికిరణ్ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సీఐటీయూ సహాయ కార్యదర్శి మీన, మహిళ సంఘం ఐద్వా కార్యదర్శి శశికళ, పట్నం కార్యదర్శి కోటిరెడ్డి, అవాజ్ కార్యదర్శి అబ్దుల్ సత్తార్, సీఐటీయూ ఉపాధ్యక్షులు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.