Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సమాజం మంచి మార్గంలో పయనించాలంటే కళా సాహితీ రంగాల వికాసం అవసరమని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. సాంస్కృతిక సంస్థలు కళా సంస్థలు ఎన్ని వచ్చినా సమాజానికి మేలేనని ఆయన వివరించారు. తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో సృజన భారతి నూతన సాంస్కృతిక, సాహిత్య సేవా సంస్థ ఆవిర్భావ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నారా కృష్ణ మూర్తి రచించిన సృష్టి, ప్రకృతి, మనిషి కవితా సంపుటిని సాహిత్య అకాడమీ పూర్వ్య అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. మనిషికి, ప్రకృతికి ఉన్న బంధాన్ని కవి కృష్ణమూర్తి సులువైన పదాలలో అర్ధవంతంగా చెప్పారన్నారు. నూతన సంస్థ చిహ్నంను డాక్టర్ రమణ ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వేదికపై రసమయి సంస్థ స్థాపకుడు డాక్టర్ ఏం. కె.రాము, మల్కాజిగిరి అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, సాహితీవేత్త వేణు తదితరులు పాల్గొన్నారు. సంస్థ స్థాపకుడు డాక్టర్ కొమ్మూరు ప్రసాద్ సంస్థ లక్ష్యం వివరించారు.