Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు రైతులు, ఆదివాసి గిరిజనులపై దాడులను ఆపాలి
- ఎంపీసీఐ(యూ) జిల్లా కార్యదర్శి ఎర్ర రాజేష్
- మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా, వినతి పత్రం అందజేత
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటాలు తప్పని ఎంసీపీఐ(యూ) పార్టీ జిల్లా కార్యదర్శి ఎర్ర రాజేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)ఎం సీపీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేప ట్టారు. ఈ సందర్భంగా ఎర్ర రాజేష్ మాట్లాడుతూ పోడు రైతుల పోరాట ఫలితంగా గతేడాది నవంబర్లో పోడు రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫ లమైందన్నారు. పోడు భూములకు హక్కులు కల్పించక పోగా రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ అధికారులు, పోలీ సుల ద్వారా దాడులు, లాఠీచార్జి చేయడం, అక్రమ కేసు లు పెట్టిన జైళ్లకు పంపి తీవ్ర నిర్బంధాన్ని ప్రయో గిస్తున్నదన్నారు. అటవీ శాఖ అధికారుల దాడులు, కేసులు తీవ్ర స్థాయిలో ఉన్నాయన్నారు. పోడు భూముల కు హక్కు పత్రాలు ఇవ్వాలనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల సమస్యను తక్షణం పరిష్కరిస్తామని అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. పోడు భూము ల సమస్య పరిష్కారానికి గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. చైర్మన్గా అటవీ, రెవెన్యూ శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయగా.. అది ఉత్సవ విగ్రహంగా మారిందన్నారు. 2021 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు పోడు సాగు దారుల నుంచి దరఖాస్తులను స్వీకరించినా ఏ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అన్న విషయాలు కూడా బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచడాన్ని తప్పుపట్టారు. అనధికారికంగా 13 లక్షల ఎకరాల పోడు భూములపై 3.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. పోడు రైతుల నుంచి గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఏడు నెలలు కావస్తున్నా ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయడం కానీ, ఎన్ని దరఖాస్తులు వచ్చాయో వెల్లడించ కుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం కావాలనే జాప్యం చేస్తున్నట్టు కనబడుతున్నదన్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వమే అటవీ శాఖ అధికారులకు పరోక్ష అధికారాలు ఇస్తూ గిరిజనులు, పేదలు సాగుచేసు కుంటున్న పోడు భూముల్లో జేసీబీలతో కందకాలు తవ్వడం, కంచెలు పాతడం, హరితహారం పేరుతో మొక్క లు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయడం దుర్మార్గం అన్నారు. అన్యాయమని ఎదురుతిరిగిన గిరిజనులు, పేదలపై అటవీశాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి కాళ్లు, చేతులు విరగొట్టడం, లాఠీచార్జీలు చేయడం అక్రమ కేసులకు పూనుకుందనీ, ఇప్పటికైనా పోడు సాగు దారుల నుంచి గతేడాది రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులను తక్షణం పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వాలనీ, పోడు సమస్యను పరిష్కరించేవరకు పోడు భూముల్లో అటవీశాఖ అధికారుల జోక్యం చేసుకోకూడద నే ఆదేశాలు ఇవ్వాలనీ, పోడు సాగు దారుల నుంచి ఎన్ని లక్షల ఎకరాల పై ఎంత మంది దరఖాస్తులు చేసుకున్నా రో జిల్లాల వారీగా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించా లనీ, పోడు సాగు దారులపై అటవీశాఖ, పోలీసులు సం యుక్తంగా చేస్తున్న దాడులను తక్షణం ఆపాలనీ, గిరిజ నులు, పేదల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పోడు సమస్యను పరిష్కరించక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమవుతామ ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్.రామ్ చందర్, బాలయ్య, మాలాద్రి, ఎ.వరదరాజు, టి.కృష్ణ, పి.రాజు, రాజు యాదవ్, నాగరాజ్, ఈ.యాదగిరి, అంబేద్కర్ రవి పాల్గొన్నారు.