Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
పర్యావరణ రహిత ఉత్పత్తులు ఎంతో మేలు చేస్తాయని ప్రముఖ సినీ నటి, బ్లూ క్రాస్ ఆఫ్ హైదరా బాద్ ఫౌండర్ అక్కినేని అమల అన్నారు. సుస్థిరమైన పర్యావరణ రహిత ఉత్పత్తులను అందించే ఇ-కామర్స్ సంస్థ జూబ్లీహిల్స్ రోడ్డ నెంబర్-1లో ఏర్పాటు చేసిన 'సస్టైన్‌కార్ట్' భారతదేశపు మొట్టమొదటి సస్టైన్ కార్ట్ రీటైల్ స్టోర్‌ను అక్కినేని అమలతోపాటు తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) డైరెక్టర్ శిఖా గోయెల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమల మాట్లాడు తూ సస్టైన్‌కార్ట్ రీటైల్ రంగంలోకి రావడం గర్వంగా ఉందన్నారు. ప్రకృతి పరంగా తయారయ్యే వేలాది ప్యాషన్, ఆహార, గృహలంకరణ ఉత్పత్తులు ఒకే వేదికలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. సస్టైన్‌కార్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ కాంతి దత్, సస్టైన్‌కార్ట్ సహ వ్యవస్థాపకురాలు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత హైబ్రిడ్ సూపర్ మార్కెట్ నుంచి పర్యావరణ వస్తువులను పరిశోధించి, కొనుగోలు చేయ డం ఎంతో సమయం పడుతుందన్నారు. 'సస్టైన్‌కార్ట్' వినియోగదారులు తమ దైనందిన అవసరాలన్నింటికీ పర్యావరణ రహిత ఉత్పత్తులను మాత్రమే అందిస్తుంద న్నారు. ఇందులో భాగంగా రాబోయ మూడు నెలల్లో సస్టైన్‌కార్ట్ దక్షిణ భారతదేశంలోని మాల్స్, విమానాశ్ర యాల్లో 20 ఫ్లాగ్షిప్ స్టోర్లు ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులను అందిం చాలనే లక్ష్యంగా అర్బన్ కిస్సాన్, ట్క్రెబ్ కాన్సెప్ట్స్, భూమి త్ర, రేనాడు మిల్లెట్స్, ఫ్లైబెర్రీ, ఫ్రమ్ వేదస్, కోకోసూత్ర వంటి బ్రాండ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తైలు సుస్మిత, శ్రీజ, నటి నిహారిక, నటులు సుమంత్, సామ్రాట్ రెడ్డి, నటి లక్షీ మంచు, సినీ దర్శకులు శశికరణ్ పాల్గొన్నారు.