Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి
- ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి
- తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్
- హైదరాబాద్, మేడ్చల్ కలెక్టరేట్ల ఎదుట ధర్నా
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్/మేడ్చల్ కలెక్టరేట్
ఆశావర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. సోమవారం డిమాండ్ల పరిష్కారం కోసం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ల ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. హైదరాద్ కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్, సౌత్ సిటీల కమిటీలు కార్యదర్శులు ఎం. వెంకటేష్. పి. నాగేశ్వర్ మాట్లాడారు. 2022 మే 22న దేశంలో పని చేస్తున్న పది లక్షల మంది ఆశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు అందించిందని గుర్తు చేశారు. కరోనా సమయంలోనూ ఆశా వర్కర్లు అందించిన సేవలు ఎంతో గొప్పవని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వారి సేవలు వెలకట్టలేనివని తెలిపిందని అన్నారు. 2013 సంవత్సరంలో 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చేసిన సిఫార్సుల ప్రకారం ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం ఇవ్వాలని ఆశా వర్కర్లు 106 రోజులపాటు సమ్మె చేశారని గుర్తు చేశారు. ఆ సమ్మె అనంతరం ప్రభుత్వం కేవలం పారితోషకాలు మాత్రమే పెంచి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఆశాలకు రూ. 10 వేలు ఫిక్స్డ్ వేతనం ఇస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్సు 16 నెలల బకాయిని వెంటనే చెల్లించాలన్నారు. 32 రకాల రిజిష్టర్లను ప్రభుత్వమే ప్రింట్ చేసి సప్లరు చేయాలని, ఈ లోపు ఆశావర్కర్లు రిజిష్టర్లకోసం పెట్టిన ఖర్చును ప్రభుత్వం చెల్లించాలని అన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఆశాలకు రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలన్నారు. స్కూటమి డబ్బాలను ఆశలతో మోపించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఆశావర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఐదేండ్లుగా పెండింగ్ యూనిఫార్మ్స్ వెంటనే ఆశార్కర్లకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ కమిటీ కన్వీనర్ ఎం.మీనా, సీఐటీయూ సౌత్ జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ అధ్యక్షురాలు టి.యాదమ్మ, ఆశా వర్కర్స్ సౌత్ జిల్లా అధ్యక్షురాలు కల్పన, సీఐటీయూ నాయకులు జంగయ్య, రాములు, పుల్లారావు, అజరు బాబు, కిషన్, శ్రీదేవి, రీతా తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట
పదివేలు ఫిక్స్వేతనంతో పాటు ఆశావర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట కూడా తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తింపును పరిగణలోకి తీసుకుని, 45వ ఇండియన్ లేబర్ కౌన్సిల్ ప్రకారం ఆశాలను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్, ఉపాధ్యక్షులు ఎన్.శ్రీనివాస్, ఉన్ని కష్ణన్లు డిమాండ్ చేశారు. వారాంతపు సెలవులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఆర్డీవో లింగ్యా నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఆశావర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. హేమలత, ఎం.రేవతి కల్యాణి నాయకులు సుమలత, కోమల, వాసంతి, జయప్రద, రాధ తదితరులు పాల్గొన్నారు.