Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల నాయకులు
- బండ్లగూడ డిప్యూటీ ఈవోకు వినతి
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రయివేటు స్కూల్ ఫీజులు నియంత్రించాలని డీవైఎఫ్ఐ, ఐద్వా(మహిళ), పట్నం, ప్రజాసంఘాల హైదరాబాద్ సౌత్ కమిటీ జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సౌత్ జిల్లా కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బండ్లగూడ డిప్యూటీ ఈవో ముక్రమ్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు కోట్ రెడ్డి, శశికళ, కష్ణ నాయక్ మాట్లాడుతూ విద్యపేరుతో ప్రయివేట్ యాజమాన్యం స్కూల్ ఫీజులు ఇష్టం వచ్చినట్లు వసూళ్లు చేస్తున్నారన్నారు. ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో విద్యార్థులు డ్రాప్ ఔట్ అవుతున్నారన్నారు. అలాగే బుక్స్ యూనిఫామ్, టైబెల్ట్, స్టేషనరీ వస్తువులు అమ్మితే విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా చూసిచూడనట్లు ఉంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల పేద మధ్యతరగతి తల్లిదండ్రులు మాత్రం ఫీజులు భారాలు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయం చేయాలంటే మూడు దఫాలుగా ఫీజు అవకాశాలు ఇవ్వాలని, యూనిఫామ్, బుక్స్, ఇతర వస్తువులు అమ్మితే విద్యా హక్కు చట్టం ప్రకారం స్కూళ్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు శ్రీను, బాల్ రామ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.