Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ మంగళవారం శ్రీనివాసపురంలో పర్యటించారు. ఈసందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు మొత్తం కలుషితంగా ఉండటంతోపాటు అందులోనుంచి దుర్వాసన వస్తుందని కొత్తపైప్లైన్ ఏర్పాటుచేయాలని కోరారు. దీనికి కార్పొరేటర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జలమండలి ఏఈ రవీందర్, వర్క్ఇన్స్పెక్టర్ జంగయ్య, స్థానికులు అదిమల్ల వెంకటయ్య, కృష్ణ స్వామి, వైవీకే రాజు, అదిమల్ల సందీప్, బీజేపీ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి, సంగప్ప పాల్గొన్నారు.