Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలానగర్ శోభన బస్టాప్ వద్ద ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-బాలానగర్
బాలానగర్ శోభన బస్టాపు వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గురువారం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ 'బాలానగర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యను దష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్‌తో పాటు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఫతేనగర్, బాలానగర్ డివిజన్ల ప్రజలకు మరో సమస్య తీవ్రతరమైంది. ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు వ్యయప్రయాసల కూర్చి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. శోభన బస్టాప్ నుంచి రోడ్డు దాటలేక పలు ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు ఉన్నాయి' అని చెప్పారు. వెంటనే స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి శోభన బస్టాప్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కూకట్పల్లి నియోజకవర్గం అద్యక్షుడు ఉప్పల సుమంత్, చిలుక వరుణ్ తేజ్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు చింతల శ్రీను, మాజీ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.