Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
రోడ్లకు చేపడుతున్న ప్యాచ్‌వర్క్, మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ ఓం ప్రకాష్ యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కాచిగూడ డివిజన్లోని హరీ మసీదులేన్లో చెప్పల్‌బజార్ ప్రాంతాల్లో పర్యటించి రోడ్లకు చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వయన మాట్లాడుతూ తాగునీటి పైపులైన్ నిర్మాణం కోసం తవ్విన రోడ్లకు మరమ్మతులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలన్నారు. బోనాల పండుగను పురష్కరించుకుని భక్తులు, ఫలహారపు బండ్లు వచ్చే మార్గాలతో పాటు ఆలయాల పరిసర ప్రాంతాలలో ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం వీరన్నగుట్టలో పర్యటించి బోనాల పండుగ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పలువురు నాయకులు, కాలనీ వాసులు నాయకులూ దత్రిక్ నాగేందర్, బాబ్జి సదానందం తదితరులు పాల్గొన్నారు.