Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు జి. రాంబాబు యాదవ్
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు జి. రాంబాబు యాదవ్ తెలిపారు. గురువారం బాగ్ లింగంపల్లిలోని కార్మిక విభాగం రాష్ట్ర కార్యాలయంలో కేటీఆర్ బర్త్ డే పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఆశావర్కర్లు, ఏఎన్ఎం, జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల జీతాలు పెరగడానికి ఎంతగానో కషి చేసిన కార్మిక పక్షపాతి కేటీఆర్ అని గుర్తు చేశారు. టీఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలో పరిశ్రమల్లో, లేబర్ అడ్డాల వద్ద, పని ప్రదేశాల్లో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్, వాటర్ వర్క్స్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జయరాజు, సలహాదారులు లక్ష్మణ్ కుమార్, డొమెస్టిక్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల రెడ్డి, హమాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, టీిఆర్ఎస్ కేవీ నగర అధ్యక్షులు బాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.