Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే గోపాల్
నవతెలంగాణ-అడిక్మెట్
చదువుతోపాటు క్రీడల్లో కూడా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం దోమలగూడలోని భారత్ స్పోర్ట్స్ అండ్ గైడ్ స్కూల్లో చెస్, కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, టెన్నీకాయిట్, అథ్లెటిక్ పోటీలను ప్రారంభించారు. కబడ్డీ, చెస్ పోటీలో పాల్గొని విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని పెంపొందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో విద్యార్థుల అత్యుత్తమమైన ప్రతిభను చూస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులు ఎల్లప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టకుండా సమయం దొరికినప్పుడు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో అపారమైన సజనాత్మకత దాగి ఉందన్నారు. దాన్ని వెలికి తీస్తే దేశం గర్వించదగ్గ క్రీడాకారులు గా రాణిస్తారని తెలిపారు. కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహా, పాఠశాల హెడ్ మాస్టర్ వరలక్ష్మి, ముచ్చకుర్తి ప్రభాకర్, కలవ గోపి తదితరులు పాల్గొన్నారు.