Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
అసంఘటిత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బీసీడబ్ల్యూయూ (సీఐటీయూ)సౌత్ జిల్లా ఉపాధ్యక్షులు నెమ్మది గోపాల్ డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం బేగంబజార్ లేబర్ అడ్డా వద్ద భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికుల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ సౌత్ జిల్లా సహాయ కార్యదర్శి రాజు, బేగంబజార్, సెంట్రింగ్ యూనియన్ నాయకులు బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.