Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
రైల్వే వంతెన పనులు పూర్తి అయ్యేవరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నాను ఉధృతం చేయనున్నట్లు ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ అన్నారు ఈ సందర్భంగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని మహా ధర్నాలో భాగంగా ధర్మశాల నుండి ఘట్కేసర్ అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ రైల్వే బ్రిడ్జి పనులు త్వరగా చేపట్టాలని నిర్వహించిన మహా ధర్నాకు రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొన ఉద్యమ కారులు, వివిధ పార్టీ నాయకులు, యువజన సంఘాలు, కుల సంఘాలు, వ్యాపారులు, మేధావులు, విద్యార్థినీ, విద్యార్థులు మీడియా, విలేకరుల, మిత్రులు ఆధ్వర్యంలో విజయ వంతంగా జరిగింది. ఉద్యమనేత అబ్బసాని యాదగిరి యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే రైల్వే బ్రిడ్జి పనులు ప్రారంభించి ఇల్లులు కోల్పోతున్న బాధితులకి నష్ట పరిహారంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కేటాయించాలని, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఘట్కే సర్ బస్ స్టాండ్ వరకు రావాలని మహా ధర్నా చేయడం జరిగింది. నిరాహారదీక్షను చేపట్టి రైల్వే బ్రిడ్జి పనులు పూర్తి అయేంతవరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామని ప్రకటించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు బేతాల నర్సింగ్రావ్, కుతాడి రవీందర్, మేకల పద్మారావ్, కడపొల్ల మల్లేష్, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్, బూరుగు చంద్రశేఖర్ సల్లూరి నర్సింగ్రావ్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకష్ణ ముదిరాజ్, సహకార బ్యాంకు డైరెక్టర్ రేసు లక్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.