Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయంజాల్
వడ్డెర వృత్తిదారుల సమస్యలను పర్కించాలని వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుంచం. వెంకటకృష్ణ అన్నారు. గురువారం తుర్కయాంజాల్‌లో వడ్డెర వృత్తిదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుంచం వెంకటకష్ణ మాట్లాడుతూ వడ్డెర వృత్తిదారులకు షరతులు లేకుండా లోన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన వడ్డెరులకు పింఛన్లు ఇవ్వాలి కోరారు. ప్రమాదంలో చనిపోయిన వడ్డెర వత్తిదారులకు 25లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూములు, రేషన్‌కార్డులు, ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్డెరలకు క్వారీలపై పూర్తి హక్కులు ఇవ్వాలని, దళిత బంధు మాదిరిగా వడ్డెర బంధు ప్రకటించి వెనుకబడిన కుటుంబాలకు ఇచ్చి అభివద్ధి చేయాలని డిమాండ్ చేశారు. వడ్డెరలను ఎస్టీ జాబితలో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పల్లపు విఘ్నేశ్, దేరంగుల రామకృష్ణ, తన్ళీరు సైమన్, గండికోట సత్యం తదితరులు పాల్గొన్నారు.