Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర స్ఫూర్తితో తెలంగాణ 33 జిల్లాల చరిత్ర-సంస్కతి, సాహిత్యం, కళలకు సంబంధించిన వేర్వేరు గ్రంథాలను ఒక ప్రణాళిక ప్రకారం వెలువరిస్తున్నామని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి వెల్లడించారు. శుక్రవారం పరిషత్తులోని డా. దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో తెలంగాణ సాహితీమూర్తులకు ఉత్తమగ్రంథ, యువ, వరిష్ట పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ ఇప్పటి వరకు 5 జిల్లాల సమగ్ర స్వరూప గ్రంథాలు పూర్తి చేసి ఆవిష్కరించామని, ఒక ఏడాది కాలంలో అన్ని పూర్తి చేస్తామని శివారెడ్డి ప్రకటించారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య స్వాగతోపన్యాసం చేస్తూ జన్మతః తెలంగాణ వారికే పరిషత్తు ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సాంస్కతిక పునరుజ్జీవన కషిలో పరిషత్తు 79 ఏండ్లు అనితర సాధ్యమైనరీతిలో నిబద్ధతతో పాటు పడుతున్నదని ఆయన చెప్పారు. కవితా ప్రక్రియలో డా.ఏనుగు నరసింహారెడ్డి 'తెలంగాణ రుబాయిలు', వచన కవిత్వంలో వంశీకష్ణ రెప్పవాలని రాత్రి, నవలా ప్రక్రియలో మెట్టు మురళీధర్ 'కనిపించని శత్రువు', సాహిత్య విమర్శలో ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్ర సాహిత్యం-1, కథా ప్రక్రియలో పెద్దింటి అశోక్ కుమార్ 'గుండెలో వాన' ఇతరాల విభాగంలో తుమ్మూరి రాంమోహన్ రావు 'మానేరు ముచ్చట్లు' గ్రంథాలకు ఉత్తమ గ్రంథ పురస్కారాలు, తండ హరీష్ గౌడ్ 'ఇన్‌బాక్స్' కవితా సంపుటి, స్ఫూర్తి కందివనం 'చైత్ర' నవలకు యువ పురస్కారాలు, డా. గండ్ర లక్ష్మణరావు, డా.నాళేశ్వరం శంకరం, డా. భూపాల్, జ్వలితలకు వరిష్ట పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రముఖ రచయిత భూపాల్ రచించిన 'చిట్టిచదువు' అనే బాల కథాగేయాల పుస్తకాన్ని ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఆవిష్కరించారు. పురస్కార గ్రహీతలు తమకు గౌరవం అందించినందుకు పరిషత్తుకు కతజ్ఞతలు తెలిపారు. పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు వందన సమ్పరణ చేశారు.