Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఈఈయు సౌత్ సర్కిల్ జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కుమార చారి
నవతెలంగాణ-ధూల్‌పేట్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూనియర్ లైన్ మెన్(జేఎల్ఎం) పోస్టులను ఆర్టిజన్ ఉద్యోగులతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(యుఈఈయు) రాకë అధ్యక్షులు కుమార్ చారి, ప్రధాన కార్యదర్శి కె గోవర్ధన్ కోరారు. శుక్రవారం సంతోష్‌నగర్‌లోని సీఐటీయూ కార్యాలయంలో సౌత్ సర్కిల్ ఉద్యోగుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐటీయూ చూపిన మార్గ నిర్దేశకత్వంలో 1989 నుంచి అనేక పోరాటాలు చేసి పలు హక్కులు సాధించుకున్నామని గుర్తు చేశారు. ఇటీవల సౌత్ సర్కిల్ పరిధిలో పెండింగ్ సమస్యలపైన పోరాడిన ఉద్యోగుల్ని అభినందించారు. పోరాట ఫలితంగా ప్రమోషన్ల, బదిలీలు చేయించుకోగలిగామని అన్నారు. ఆన్ని కేడర్ ఉద్యోగుల్లో సీఐటీయూ అనుబంధ యుఈఈయును విస్తరించే అవకాశం ఉందని సభ్యులకు గుర్తు చేశారు. జేఎల్ఎం పోస్టులను సాధించేందుకు పోరాట కార్యాచరణకు సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు సులేమాన్, రాష్ట్ర నాయకులు రాము, ఆస్మాంగడ్, బేగంబజార్, చార్మినార్ డివిజన్ల నాయలు, సురేష్, మున్నరావు, రమేష్, సౌత్ జిల్లా సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు ఎం. శ్రావణ్ కుమార్, పి. నాగేశ్వర్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఎం. మీనా పాల్గొన్నారు.