Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరారీలో ఇద్దరు నిందితులు
- వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్
నవతెలంగాణ-హయత్‌నగర్
మహిళలను అక్రమ రవాణా చేసి వ్యభిచారం రొంపిలో దింపుతున్న ముఠాను ఉప్పల్ పోలీసులు, హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎల్బీనగర్లోని పోలీస్ కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ మహేష్ మురళీధర్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉపాది పేరుతో అమాయక మహిళలను హైదరాబాద్ తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారనే పక్కా సమాచారంతో ఉప్పల్ పోలీసులతో కలిసి యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. బంగ్లాదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి అమ్మాయిలను తరలించి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం రొంపిలో దింపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ నెల 11న ఫిర్యాదు స్వీకరించిన ఉప్పల్ పోలీసులు దాడుల్లో హైదరాబాద్‌కు చెందిన దీపక్ చంద్‌తోపాటు మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. జార్ఖండ్‌కు చెందిన ప్రధాన సూత్రదారి సతీష్ రజాక్‌తో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ దాడుల్లో ఇద్దరు విదేశీ మహిళలతో పాటు ఓ బాలికను పోలీసులు రక్షించారు. ఆరుగురు నిందితులను రిమాండ్‌కు తరలించిన పోలీసులు ఓ షిఫ్ట్ కారు, ఏడు మొబైల్ పోన్లు, సిమ్స్ కార్డులు, నకిలీ సర్టికెట్స్ స్వాధీనం చేసుకున్నారు. మానవ అక్రమ రవాణకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు అవుతాయని సీపీ హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఉప్పల్ ఏసీపీ నరేష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.