Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలను ప్రభుత్వం విరమించుకోవాలి ప్రయివేటు ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు జయశంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ప్రభుత్వం ప్రాథమిక ఉపాధ్యాయులకు ఎటువంటి ఉన్నత పదవులు కల్పించకుండా తాత్కాలిక సర్దుబాటు పేరుతో డిప్యూటేషన్‌పై బదిలీలు చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. ఆంగ్ల మాధ్యమం పేరుతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను హైస్కూల్‌కి బదిలీ చేస్తూ సమాన పనికి సమాన వేతనం అనే హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. సమావేశంలో ప్రయివేటు ఉపాధ్యాయుల సంఘం జనరల్ సెక్రటరీ రాజు, అడ్వైజర్లు నర్సింగరావు, శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.