Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం)లో పనిచేస్తున్న నాలుగు వేల మంది ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నర్సింహా, రమ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. శుక్రవారం కోఠి డీఎంహెచ్ఎస్ ఆవరణలో ఉన్న కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కొన్ని క్యాడర్ల సిబ్బందికి అనేక సందర్భాల్లో మెమోరాండాలు ఇచ్చినప్పటికీ జీతాలు పెరగడం లేదని, వారందరికీ వెంటనే జీతాలు పెంచి న్యాయం చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ప్రకారం కనీస వేతనం అందడం లేదని, అతి తక్కువ జీతాలతో కార్మికులు పనిచేస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎన్హెచ్ఎం స్కీం పనిచేస్తున్న మహిళలకు ప్రసూతి సెలవులు 180 రోజులు ఇవ్వాలన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కోఠి హెల్త్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎన్హెచ్ఎం చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుస్మితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సుస్మిత, లావణ్య, సంపత్, స్వప్న, మౌనిక, రమేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.