Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి కె. అశోక్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
అబిడ్స్‌లోని బార్సు హాస్టల్లో విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని, ఇటీవలె కురిసిన వర్షాలకి హాస్టల్ పైకప్పు నుంచి రూమ్‌లోకి వర్షపునీరు కురుస్తుండటంతో పడుకోవడానికి స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి కె. అశోక్‌రెడ్డి తెలిపారు. యూనివర్సిటీలోని విద్యార్థులకు వసతి కల్పించాలని కోరారు. ఈ సమస్యను జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఉన్నటువంటి హాస్టల్‌ను కూల్చివేసి కొత్త బిల్డింగ్ నిర్మిస్తామని, హాస్టల్‌ను ఖాళీ చేయాలని ఇప్పటికే నోటిసులు ఇవ్వడంతో హాస్టల్లోని 70 మంది పేద విద్యార్థులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులో ఉన్నారని వివరించారు. యూనివర్సిటీలోనే విద్యార్థులకు వేరే గదులు కేటాయించి, వారికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ తరఫున కోరినట్టు ఆశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.