Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
భారత్ ఆర్ట్స్ అకాడెమీ, ఏబీసీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో రవీంద్రభారతి ప్రధాన వేదికపై తెలంగాణ బోనాల సంబురాలు జానపద, శాస్త్రీయ నత్య భరితంగా జరిగాయి. 'అమ్మో బయలు ఎల్లిందో అంటూ జానపద నత్య శైలిలో కళాకారిణిలు గజ్జల గళగళలతో సందడి చేయగా దేవీ భవానీ అని శాస్త్రీయ నత్య ప్రక్రియలో నర్తకి మణులు లయబద్దంగా నర్తించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంఖ్యా శాస్త్రవేత్త దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయ పండుగ బోనాలు జరిపి నిర్వాహకులు రమణ రావు, లలిత సంస్కతి పరిరక్షణో తమవంతు కషి చేస్తున్నారని, ఇలాగే వారి సేవ కొనసాగాలని ఆకాంక్షించారు. అతిథులుగా బుల్లి తెర నటులు నరేష్, మానస పాల్గొన్న సభలో నాట్య గురువులు కనక దుర్గ, ఏకవీర, విమల, కవ్యశ్రీ పటేల్, లక్ష్మి, భారతి నాయుడు, కావ్య, డాక్టర్ మనోహర్, అర్జున్, అశోక్ లను అతిథులు సత్కరించారు. రమణా రావు తమ సంస్ట లక్ష్యం కళాకారులకు వేదిక కల్పించి సంప్రదాయ కళలను ప్రోత్సాహించడమేనని తెలిపారు. లలితా రావు కార్యక్రమాన్ని నిర్వహించారు.