Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువ నాయకులు పి.కార్తీక్ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ,యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటంతో పాటు మహిళలకు వత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి కుటుంబ పోషణ, జీవనోపాధికి బాటలు వేస్తుందని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు, ఇంద్రారెడ్డి ట్రస్టు చైర్మెన్ పటోళ్ల కార్తిక్‌రెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్ లోని పహాడి షరీఫ్‌లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు పి.ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మెన్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి జల్పల్లి పురపాలక సంఘంలోని పహాడీ షరీఫ్‌లో రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మహమ్మదీయ కాలనీ రెసిడెన్షి యల్ వెల్ఫెర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరం కషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖైసర్ బామ్, జల్పల్లి మున్సిపాలిటీ రీప్రజెంట్ వైస్ చైర్మెన్ యూసుఫ్ పటేల్, జల్పల్లి మాజీ సర్పంచ్ ప్రస్తుత కో ఆప్షన్ సభ్యులు సూరెడ్డి క్రిష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు అబ్దుల్లా, మాజీ సర్పంచ్ మేరాజ్ ఖాన్, జల్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు పుష్పమ్మ కొండల్ యాదవ్, ఖాలేద్ మారుస్, షేక్ పమీద అఫ్జల్, శంషోద్దీన్, పి.శంకర్, లక్ష్మీనారాయణ, సౌద్ ఆవలిగి, మహమ్మదీయ కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసిియేషన్ అధ్యక్షులు అబ్దుల్ అమీర్‌ఖాన్, ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు డి.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ జాహగీర్, సీనియర్ టీిఆర్‌ఎస్ పార్టీ నాయకులు నాసర్ వలగి, సమీర్, విశాల్‌గౌడ్, ఖద్దిర్బారు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.