Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి
నవతెలంగాణ-హస్తినాపురం
బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో గల అనంతవేణి నగర్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు ఎక్కువగా వచ్చి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని కాలనీవాసులు కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి దష్టికి రావడం జరిగింది. వెంటనే సమస్యపై స్పందించిన కార్పొరేటర్ తక్షణ మే జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి ఇళ్లల్లో నుంచి వరద నీరు తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే వరద సమస్యలను శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా దశల వారీగా నిర్మాణ పనులు చేపడుతామని డివిజన్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరిస్తామని వారు కాలనీవాసులకు కార్పొరేటర్ భరోసా ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్‌తో పాటు జీహెచ్ఎంసి డీఈ దామోదరరావు, ఏఈ చంద్రశేఖర్ రెడ్డి, మరియు కాలనీ అధ్యక్షులు తిరుమలేష్, ప్రధాన కార్యదర్శి నరసింహ తదితరులు పాల్గొన్నారు.