Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్
- మల్కాజిగిరి తహసీల్దార్ ఆఫీసు వద్ద వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం
నవతెలంగాణ-నేరెడ్మెట్
రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని, వారికి పే స్కేల్ వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పిం చాలని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ డిమాండ్ చేశారు. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం మల్కాజిగిరి తహసీల్దార్ ఆఫీసు ఎదుట నాలుగురోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్ఏల ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నాలుగు రోజు లుగా వీఆర్ఏలు సమ్మెలో ఉంటే ప్రభుత్వం పట్టించుకోక పోవడం అన్యాయమని అన్నారు. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని, నీళ్లు, నిధులు, నియా మకాలు, ప్రమోషన్లు వంటి అన్ని సమస్యలు పరిష్కారమ వుతాయని నాడు ప్రతీ ఉద్యోగి పెన్‌డౌన్ వంటి కార్యక్ర మాలు చేపట్టారని గుర్తుచేశారు. అలాంటివారిలో వీఆర్ఏలు కూడా ఉన్నారని, వారు నేడు సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు దిగితే ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 23 వేలమంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో, ప్రగతి భన్‌లో మూడుసార్లు ప్రస్తావిం చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వీఆర్ఏలకు రూ.10వేల 500 అంటే అతి తక్కువ జీతం ఇస్తూ పనిచేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో పనులు ఆగమేఘాల మీద చేసే సీఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఏల విషయంలో ఇలా చేయడం సరికాదు అన్నారు.
వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వీఆర్ఏలు రేణుక, సంగీత, బాలమణి, రాష్ట్ర నాయకురాలు లక్ష్మి, నిమ్మ అశోక్ రెడ్డి, చంద్రశేఖర్, సిఎల్. యాదగిరి, రాజలింగం, వెంకటేష్ యాదవ్, వి.శ్రీనివాస్‌గౌడ్, వంశీ ముదిరాజ్, శ్రీనివాసులు, పవన్ కుమార్, వాసు, పాండు, గుత్తి రాంచందర్, యం.ఆర్.శ్రీనివాస్ యాదవ్, బుచ్చిబాబు, జేకే సాయిప్రసాద్, సంతోష్ రెడ్డి, మొమిన్ బాషా, వైయన్నార్, శివకుమార్, సంతోష్, ప్రవీణ్, సత్యనారాయణ, రాజన్, సుబ్బారెడ్డి, బాలపీరు, ఆశా తదితరులు పాల్గొన్నారు.