Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయవాద జేఏసీ కన్వీనర్లు పులిగారి గోవర్ధన్ రెడ్డి
నవతెలంగాణ-అడిక్మెట్
తెలంగాణ ప్రాంతంలో తిరిగే నైతిక హక్కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేదని న్యాయవాద జేఏసీ కన్వీనర్లు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కవాగూడ డివిజన్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తెలంగాణకు సంబంధించిన ఏడు మండలాలను ఆగమేఘాల మీద నాడు మోదీతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో దొంగ చాటుగా కలుపుకున్నారని తెలిపారు. నేడు అదే ప్రాంతాన్ని సందర్శించి మళ్లీ తెలంగాణలో కలపాలని ముసలి కన్నీరు కార్చడం ద్వందనీతికి నిదర్శనం అన్నారు. సీలేరు ప్రాజెక్టుతో సహా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నాడు రాజకీయ లబ్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను కలుపుకొని.. నేడు ఆ ప్రాంత ప్రజలు తిరగబడతారని భయంతో ప్రజలందరూ తెలంగాణలో ఉండాలని కోరుకుంటే నువ్వు అక్కడికి పోయి వారిని పరామర్శిస్తుంటే ఊసరవెల్లి గుర్తుకొస్తుంది అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతంలో తిరిగే నైతిక హక్కు చంద్రబాబు నాయుడుకి లేదని తెలిపారు. కార్యక్రమంలో కొంతం గోవర్ధన్ రెడ్డి, మంత్రి రవీందర్రావు, వొద్యారపు రవికుమార్, టి. వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.