Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
మున్సిపల్ కార్మికులకు బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. మలక్‌పేట్ సలీం నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ మూడో మహా సభలు జయప్రదం చేయాలని కార్మికులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదన్నారు. మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేస్తానని వాగ్దానం చేసి నేటికీ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలన్నారు. కార్మికులకు బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేసి, రాంకీ ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు హామీలు ఇస్తూ పెంచిన నిత్యావసర వస్తువులు ధరలు రోజురోజుకు పెంచి పేద కార్మికులపై భారాలను మోపుతుందన్నారు. కార్మికుల శ్రమకు తగిన వేతనాలు పెంచడం లేదన్నారు. పనిగంటలు కార్మికులపై వేస్తూ వేధింపులు గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, పని భారాలు తగ్గించాలన్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈసమస్యలపై రాబోయే రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. నేడు జరగబోతున్నటువంటి మూడో మహాసభ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ పోరాటాలకు రూపకల్పన కావాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.