Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సినారె జ్ఞాపకార్థం బంజారాహిల్స్ ప్రాంతంలో సాహిత్య సారస్వత సదనం త్వరలో అందుబాటులోకి రానున్నదని రాష్ట్ర సాంస్కతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రవీంద్ర భారతి ప్రధాన వేదికపై విఖ్యాత కవి సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవం భాష సాంస్కతిక శాఖ ఆధ్యర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ సినారె కవిత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రభావితం చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ మాగాణిలో పుట్టిన మహనీయులు కాళోజీ దాశరథి వంటి వారల జయంతులు అధికారికంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సాహిత్య అకాడెమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి, సాహితీవేత్త అశోక్ కుమార్, సంచాకులు డాక్టర్ మామిడి హరికష్ణ పాల్గొన్నారు.