Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ సౌత్ జిల్లా కార్యదర్శి కష్ణ నాయక్
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రభుత్వ స్కూల్ ముందున్న చెత్తకుప్పల వెంటనే శుభ్రం చేయాలని డీవైఎఫ్ఐ సౌత్ జిల్లా కార్యదర్శి కష్ణ నాయక్ అన్నారు. శుక్రవారం జంగంమెట్‌లో పర్యటించి స్థానికంగా ఉన్న ప్రభుత్వ హైస్కూల్‌ను పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కార్బడి ముందు చెత్తాచెదారం నిండిపోవడంతో తరగతి గదుల్లోకి వాసన వస్తుండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా చెత్త కుప్పలు తెప్పలుగా రోడ్డుపై ఉండటంతో విద్యార్థులు అనేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే చెత్త కుప్పలను తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంవీ పౌండేషన్ వినోద్, డీవైఎఫ్ఐ నాయకులు శ్రీను, రాజేష్, ఈశ్వర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.