Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ సభ్యులు ఆర్ కష్ణయ్య
- ఆగస్టు 9న చలో ఢిల్లీ
నవతెలంగాణ-అడిక్మెట్
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కష్ణ ఆధ్వర్యంలో విద్యానగర్ బీసీ భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సాకు చెందిన ముఖ్య బీసీ నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్ కష్ణయ్య హాజరై మాట్లాడుతూ బీసీల ఉద్యమానికి బీసీ ఉద్యోగులు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఐక్యమత్యంగా ఉద్యమిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. దేశంలో 56% జనాభా గల బీసీలకు కులగణన చేయకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఇతర సమస్యలపై పార్లమెంట్లో ఉద్యమాలు చేస్తున్న రాజకీయ పార్టీలు బీసీ కులగణన విషయంలో నోరు మెదపరే అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జనగణన జరిగే అవకాశం ఉన్న బీసీ వ్యతిరేక వైఖరితో డిమాండ్లను అంగీకరించడం లేదన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఆగస్టు 9న జరిగే పార్లమెంట్ ముట్టడిలో బీసీలు పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ బీసీ సేన అధ్యక్షులు బూరుగుపల్లి కష్ణ యాదవ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సేన అధ్యక్షులు సొంటి నాగరాజు, పెద్దయ్య యాదవ్, రాములు, జిల్లపల్లి అంజి, భూపల్లె అశోక్, బాలకష్ణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.