Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఐక్యతతోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చునని తెలంగాణ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఉపాధ్యక్షులు డాక్టర్ కె.రంగారావు అన్నారు. జార్ఖండ్ ఏక్తా సమాజ్ ఐదో వార్షికోత్సవ సమావేశం కింగ్ కోఠిలోని రూబి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. అధ్యక్షుడు జికెందరాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్.కె. రంగారావు మాట్లాడుతూ. నగరంలో జార్ఖండ్ వాసులు వివిధ పనులు ఎనిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన వారు దాదాపు 50,000 మంది ఉంటారన్నారు. వీరంతా చిన్న హోటల్స్ మొదలుకొని పెద్ద పరిశ్రమల్లో కార్మికులుగా, సూపర్వైజర్లు పని చేస్తున్నారని తెలిపారు. వీరందరూ బంగారు తెలంగాణా నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈసందర్భంగా హోటల్లో పనిచేస్తున్న జార్ఖండ్ కు చెందిన జితిన్ రామ్ షాద్ నగర్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతని కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల 50వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జార్ఖండ్ రాష్ట్ర మాజీ డీజీపీ ఎంవీ రావ్, ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ రాకేష్ జైశ్వాల్, గోవిందరాఠి, శైలేందర్ యాదవ్, ఆంజనేయులు, దీపక్ సింగ్, గోపాల్ పాల్గొన్నారు.